జబర్దస్త్ యాంకర్ సిరి రెమ్యూనరేషన్ అంతా!
on Nov 12, 2023
జబర్దస్త్ షోకి యాంకర్స్, జడ్జెస్ ప్రతీ సారీ చేంజ్ అవుతూనే ఉంటారు. ఈ కామెడీ షోకు మొదట అనసూయ, రష్మి యాంకర్స్ గా చేశారు. అనసూయ మూవీస్ లో ఛాన్సెస్ వచ్చేసరికి ఆమె ఈ షోకి బైబై చెప్పేసింది. కొంత కాలం ఆమె ప్లేస్ లో రష్మీ ఇటు జబర్దస్త్, అటు ఎక్స్ట్రా జబర్దస్త్ కూడా ఒంటి చేత్తో నడిపించింది. ఇక ఆమెకు కూడా మూవీస్ లో ఛాన్సెస్ వస్తుండడం డేట్స్ కుదరకపోయేసరికి ఆమె ప్లేస్ లో సౌమ్య రావు వచ్చింది. ఇక ఇప్పుడు ఆమె కూడా షోకు బై బై చెప్పేసింది. ఇప్పుడు ఆమె ప్లేస్ లో బిగ్ బాస్ బ్యూటీ సిరి హనుమంత్ వచ్చింది. రావడం ఐతే వచ్చింది కానీ ఇప్పుడు అందరి ద్రుష్టి ఆమె రెమ్యూనరేషన్ మీద ఉంది. ఇంతకు ఆమె రెమ్యూనరేషన్ ఎంత అంటూ ఆరా తియ్యడం స్టార్ట్ చేశారు.
ఇదివరకు పనిచేసిన యాంకర్స్ కి ఒక్కో ఎపిసోడ్ కు రెండు లక్షలు రూపాయలు పుచ్చుకునేవారు. కానీ సిరి విషయంలో మాత్రం మల్లెమాలవారు కాస్త ఎక్కువ మొత్తంలో అంటే ఒక్క ఎపిసోడ్ కి సుమారు 3.5 లక్షల రూపాయల రెమ్యూనరేషన్ ఇస్తున్నారంటూ ఒక న్యూస్ వైరల్ అవుతోంది. అంటే ఇంతకుముందు ఉన్నవాళ్ళ కంటే బాగా ఎక్కువగానే ఛార్జ్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
సిరి హనుమంత్ పులి- మేక వెబ్ సిరీస్ లో నటించింది. అలాగే రీసెంట్ గా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ జవాన్ సినిమాలో నటించింది. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేసిన ఈ బ్యూటీకీ మంచి పేరు వచ్చింది. ఇప్పుడు ఈ భామ జబర్దస్త్ లో అలరిస్తోంది. ఈ షో ఎంతోమందికి మంచి లైఫ్ ఇవ్వడంతో పాటు ప్రతీ ఒక్కరికీ ఒక ప్రత్యేక ఐడెంటిటీ కూడా ఇచ్చింది.
Also Read